బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి గెల్లు శ్వేత

బోనం ఎత్తుకొని పూజలు
నిర్వహించిన గెల్లు శ్వేత

వీణవంక, జూన్ 1 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో శ్రీపాలగోవుల మల్లికార్జున స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా మల్లికార్జున స్వామి బోనాల కార్యక్రమం, కళ్యాణ మహోత్సవంలో పాల్గొని బోనం ఎత్తుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి గెల్లు శ్వేత.

ఈ కార్యక్రమంలో వీణవంక మండల సర్పంచ్ ఫోరంల అధ్యక్షులు వల్బాపూర్ గ్రామ సర్పంచ్ ఎక్కటి రఘుపాల్ రెడ్డి , ఉప సర్పంచ్ కాసం శ్రీనివాస్, వార్డ్ మెంబర్స్ చిన్నాల కార్తీక్, కిరణ్, యాదవ సంఘం అధ్యక్షులు కన్నవేన తిరుపతి , ఆలయ కమిటీ నిర్వాహకులు కార్తీక్ రెడ్డి, బుచ్చి రెడ్డి, రాజి రెడ్డి, ఒగ్గు కళాకారులు గొరిగే శ్రీనివాస్, న్యాల సంపత్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మి రెడ్డి, జమ్మికుంట పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీపతి నరేష్, బిఆర్ఎస్వి నాయకులు చిన్నాల శ్రీకాంత్, అవుల తిరుపతి, శివ యాదవ్, చిన్నాల సురేందర్, నాని, అఖిల్, రాకేష్, రాజశేఖర్, హరీష్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *