నా కార్యకర్తల జోలికి వస్తే
క్రేన్ కు ఉరితీస్తా:కొండా

- కొండా మురళి వివాదాస్పద కామెంట్స్
వరంగల్, జూన్ 1 (విశ్వం న్యూస్) : “కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, యూత్ కాంగ్రెస్ పిల్లలకు ఏం జరిగినా.. పోలీసులకు చెప్పి మరీ క్రేన్‌కు వేలాడతీసి ఉరేస్తా. దౌర్జన్యాలు చేస్తున్నారు. ముందుగా సీపీ గారి, ఏసీపీ గారికి చెబుతాం. వాళ్లు చర్య తీసుకోకపోతే మాత్రం.. పాత కొండ మురళి బయటకు వస్తడు. నాకు జైళ్లు, పోలీసు స్టేషన్లు కొత్త కాదు. నా కార్యకర్తలకు ఏం జరిగినా నేను ఊరుకోను. మెున్న రేవంతన్న కూడా చెప్పిపోయిండు ఇది కొండా సురేఖా నియోజవర్గమని.

ఈ మధ్య కొత్తవాళ్లు వస్తరు. మీటింగ్‌లు పెడ్తరు. వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరెక్కడున్నా.. కొండా సురేఖనే ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్తడి. అని కొండా మురళి కామెంట్స్ చేశారు.” వరంగల్ తూర్పు టికెట్ విషయంలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు.