వీణవంక:ఘనంగా తెలంగాణ
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి
వీణవంక, జూన్ 2 (విశ్వం న్యూస్) : వీణవంక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల భాగంగా ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అదేవిధంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రాజయ్య జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా కేసీఆర్ పాలన ఉందన్నారు 20 రోజులపాటు జరిగే దశాబ్ది ఉత్సవాలను గ్రామ గ్రామీణ ఘనంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నాను.
పల్లె ప్రజల విజయాలను మిషన్ భగీర పెన్షన్ 24 గంటల కరెంటు రైతుబంధు ఇలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాయుశెట్టి లతా శ్రీనివాస్, జడ్పిటిసి మాడ వనమాల సాధవరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, పోతుల నరసయ్య, ఎంపిటిసి మోరే స్వామి,ఎంపీడీవో ప్రభాకర్, ఏవో గణేష్, డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ ఐ రవి, ప్రవీణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.