ఇల్లంతకుంట:కౌశిక్ రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రైతులకు
వెంటనే క్షమాపణ చెప్పాలి

ఇల్లంతకుంట, జూన్ 5 (విశ్వం న్యూస్) : రైతు దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి రైతుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగిలే రామారావు తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఇంగిలే రామారావు మాట్లాడుతూ 9 సంవత్సరాల క్రితం మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందని మూడు నెలల క్రితం కేసీఆర్ ప్రకటించిన పదివేల రూపాయల నష్టపరిహారం ఏమైందని రైతు అడిగినందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రైతుని సిగ్గు శరం లేదా అని మాట్లాడడం మంచి పద్ధతి కాదు వెంటనే రైతుకు క్షమాపణ చెప్పాలని లేకపోతే హుజురాబాద్ నియోజకవర్గంలో అడుగడుగునా అడ్డుకుంటామని తిరగనియ్యమని హెచ్చరించారు.

రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్ మెన్ చైర్మన్ బండి మల్లేష్, గొడిశాల పరమేష్, శనిగరపు రాము, మంకు ఐలయ్య, NSUI నాయకులు గుండారపు సాయికుమార్, పెద్ది అభి యూత్ కాంగ్రెస్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *