ఫిర్యాదు బాక్స్ లను వెంటనే ఏర్పాటు చేయాలి

ఫిర్యాదు బాక్స్ లను వెంటనే ఏర్పాటు చేయాలి

జిల్లా అంబుడ్స్ మెన్ ఆడెపు లక్ష్మీనారాయణ సూచన
తిమ్మాపూర్, జనవరి 10 (విశ్వం న్యూస్) : కరీంనగర్ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, తమ సమస్య లను నేరుగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికా రులకు ఫిర్యాదు చేయవచ్చునని, డీఆర్డీఓ, కరీంనగర్ జిల్లా అంబుడ్స్ మెన్ ఆడెపు లక్ష్మీనారాయణ తెలి పారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద కంప్లైంట్ బాక్స్ ను కూడా ఏర్పాటు చేయాలని
గ్రామ కార్యదర్శిలకు సూచించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని బొత్తలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని కరీంనగర్ జిల్లా అంబుడ్స్ మెన్ ఆడెపు లక్ష్మీనారాయణ సందర్శిం చారు. ఉపాధి కూలీల జీతభత్యాల విషయం పైన పంచాయతీ కార్యదర్శిని ,ఏపీఓను అడిగి తెలుసు కున్నారు. గ్రామ సచివాలయం ముందు ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయవలసిందిగా గ్రామ సచివాలయం కార్యదర్శికి ఏపీవో లలితకు సూచించారు. హరిత హారం నర్సరీని పరిశీలించి, నర్సరీలోని పలు మొక్క లను, నూతన మొక్కల సంరక్షణ కేంద్రాన్ని చెల్పూర్ క్రీడా ప్రాంగణ మైదానాన్ని సందర్శించారు. అసిస్టెంట్స్ విజిలెన్స్ ఆఫీసర్ వసంత,ఏపీవో లలిత,బత్తలపల్లి గ్రామ కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో ఈజీఎస్ పనులను, రికార్డులను, ఉపాధి హామీ పనులను, ఎవెన్యూప్లాంటేన్ నర్సరీ లను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం కూలీలు ఫిర్యాదు పెట్టెలో వేసి రసీదు తీసుకోవాలని, లేదా జిల్లా అంబుడ్స్ మెన్ కు గాని, లేదా డిఆర్డిఓ కార్యా లయంలో నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *