
జమ్మికుంట, జూన్ 6 (విశ్వం న్యూస్) : జమ్మికుంట పీసీసీ మెంబర్ కరీంనగర్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్తి కృష్ణా రెడ్డి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి రైతు వ్యతిరేకి అని రైతు దినోత్సవం పేరుతో రైతులని అసబ్య పదజాలంతో దూషించడం సరికాదన్నారు. కౌశిక్ రాజకీయాలకు పనికిరాడు అని పత్తి కృష్ణారెడ్డి అన్నారు. కౌశిక్ రెడ్డి రౌడి షీటర్, వ్యక్తిత్వం లేనివాడు అని రాష్ట్ర గవర్నర్ తన కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వలేదని గుర్తు చేశారు.
కౌశిక్ రెడ్డి 8గ్రామాల ట్రాక్టర్ యాజమానుల నుండి నెలకు ఒక్కో గ్రామం నుండి 20 లక్షలు వసూలు చేస్తున్నారని తద్వారా రూ. 2000 ఇసుక కాంట్రాక్టర్ రూ.5000 పెంచారు. ట్రాక్టర్ యాజమానుల వద్ద పోలీస్ అధికారులు డబ్బును వసూలు చేసి ఇస్తున్నారని ప్రజలు బాహాటంగా చర్చించు కుంటున్నారని అన్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే లారీలను అరికట్టాల్సిన ఎమ్మెల్సీ రోజుకు లక్ష రూపాయలు మామూలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నారని కౌశిక్ రెడ్డి చర్యలను బిఆర్ఎస్ కార్యకర్తలు సైతం తప్పు పడుతున్నారు.
అధికార బలంతో నిబంధనలతో పని లేకుండా ఆడ, మగ స్కానింగ్ చేసిన డాక్టర్ ని డియం హెచ్ ఓ పట్టుకున్నా హాస్పిటల్ ని సీజ్ చేయకుండ అధికారం ఉపయోగించి డాక్టర్ డిగ్రీ రద్దు చేయకుండా కాపాడుతున్నారని అన్నారు. రైతు వ్యతిరేకి, వసూళ్ల రాయున్ని బర్తరఫ్ చేయాలని డిమండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు సారంగపాణి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అద్యక్షుడు సజ్జు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేణుకా, శివకుమార్, ఎస్ టి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మనుపాటి సూర్య, వీనవంక మండల అద్యక్షులు సాయబుస్సేన్, చిట్యాల శంకర్, పొడేటి బిక్షపతి, హరీష్ రెడ్డి,సురేష్, మిదిదొద్ది శ్రీనివాస్, మండ అశోక్,శ్రీనివాస్, మధుకర్ రెడ్డి, మల్లేశం, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.