మంద వేణును అభినందించిన
కరీంనగర్ కలెక్టర్ అర్.వి కర్ణన్

జమ్మికుంట/కరీంనగర్, జూన్ 7 (విశ్వం న్యూస్) : దళిత భందు పథకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపినదని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ అన్నారు. కలెక్టర్ అర్.వి కర్ణన్ అధ్యక్షతన దళిత బంధు విజయోత్సవ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
దళిత బంధు పథకం ద్వారా మంజూరైన 9లక్షల 90వేల రూపాయలతో జమ్మికుంట పట్టణానికి చెందిన మంద వేణు వి.కే ఫ్లెక్సీ ప్రింటింగ్ నెలకొల్పి తాను ఉపాధి పొందుతూ ఇద్దరికీ ఉపాధి కల్పిస్తూ విజవంతమైన దారిలో పయనిస్తున్నందుకు మంచి పరిణామమని మంద వేణును కలెక్టర్ అర్.వి కర్ణన్ ప్రశంసించారని ఒక ప్రకటనలో వేణు తెలిపారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ అర్.వి కర్ణన్ మంద వేణును కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో సత్కరించి భారత రత్న డాక్టర్ బి.అర్.అంబేద్కర్ మేమెంటో అందజేసి ఉత్తమ దళిత బంధు నిర్వహణ పత్రాన్ని అందజేశారు.