బోడుప్పల్:రహదారిని కోల్పోయిన
గాయత్రినగర్ కాలని వాసులు

బోడుప్పల్, జూన్ 8 (విశ్వం న్యూస్) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్రమంతట నిడుకుండ లాంటి చెరువుల పండుగ అవుతుంటే గాయత్రినగర్ మాత్రం ఖబ్జాల చెరలో ముంపుకు గురి అవుతున్నది. మున్సిపల్ కార్పొరేషన్ అదికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు కేవలం కంటి చూపు చర్యలకే పరిమితం అవుతున్నారు తప్ప ఎవ్వరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిశీలించడం లేదు అదేవిధంగా పరిష్కరించడం లేదు.

అఖిల పక్షంలో ఉన్న ఒకరు గాయత్రి నగర్ బ్రిడ్జి పునరనిర్మాణం కోసం మున్సిపల్ కార్పొరేషన్ నుండి అక్రమంగా నిధులు కేటాయించుకొని, స్వలాభం కోసం ఎఫ్ టీ ఎల్ భూమిని కబ్జా చేసుకోవడానికి మా కాలని చక్కని బ్రిడ్జిని కూలకొట్టటం జరిగింది..! కాంట్రాక్టర్, 8వ డివిజన్ కాంటెస్టేడ్ కార్పొరేటర్ తన సొంత ప్లాట్ గా నిరూపించుకోవడానికి,ఎఫ్ టీ ఎల్ భూమిని తనదిగా చేసుకోవడానికి సుద్దకుంటను కబ్జా చేశారు. మీ ధన దాహర్షి తీరకపోతే గాయత్రినగర్ కాలని మొత్తంను కబ్జా చేసుకోగలరని కాలనీ వాసులు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకంగా నిర్మింబడుతున్న డబుల్ బెడ్ రూం ప్లాట్స్ మాకు అనగా గాయత్రి నగర్ కాలనీ వాసులకు ఇప్పించి మీ గొప్ప నాయకత్వాన్ని గొప్పగా చాటుకోగలరని కోరారు.