మహహబూబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభం

మహహబూబాద్, జనవరి 12 (విశ్వం న్యూస్) : మహహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ గారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ శాంతి కుమారితో కలిసి కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ ఛాంబర్ లోని సీటులో కలెక్టర్ శశాంకను కూర్చుండబెట్టిన సీఎం కేసీఆర్, ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాంబర్లో జరిగిన సర్వమత ప్రార్థనల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.