బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు

మహబూబాబాద్, జనవరి 12 (విశ్వం న్యూస్) : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన సీఎం, ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితా నాయక్ ను కుర్చీలో కూర్చుండబెట్టిన సీఎం కేసీఆర్, ఆమెను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
