ప్రతిరోజు యోగతో సంపూర్ణ
ఆరోగ్యం: రాం చంద్రారెడ్డి

- బోడుప్పల్ న్యూటన్ గ్రామర్ హైస్కూల్లో యోగ డే సెలబ్రేషన్స్
- ప్రిన్సిపాల్ వై కృష్ణ, యోగ కోచ్ మోహన్ రావు హాజరు
బోడుప్పల్, జూన్ 21 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ న్యూటన్ గ్రామర్ హై స్కూల్ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల కరస్పాండెంట్ కె రాం చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ వై కృష్ణ, యోగ గురువు మోహన్ రావు అధ్యక్షతన ఇంటర్నేషనల్ యోగ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా అవసరాలు మంచి ఆరోగ్యం కోసం పిల్లలకు ఎంత అవసరమో ప్రాక్టికల్ గా చేసి చూపించి యోగ ఆసనాలలో మేలుకువలు నేర్పించి, పిల్లల చేత ఆసనాలు వేయించడం జరిగింది. ఈ సందర్భంగా యోగ యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయం యోగ చేసినట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చని తెలిపారు.

యోగ ద్వారా పిల్లలకు ఆరోగ్య సమస్యలు దూరం కావడంతో పాటు మానసిక ఉల్లాసం, జ్ఞాపకశక్తి ఏకాగ్రతకు దోహదపడతాయని న్యూటన్ గ్రామర్ స్కూల్ కరస్పాండెంట్ కే రామ్ చంద్రారెడ్డి పిల్లలను ఉద్దేశించి వివరించారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రోటోకాల్ విధానాన్ని అనుసరించి ఉదయం వన్ అవర్ మా విద్యార్థిని విద్యార్థులకు యోగ గురువు మోహన్ రావు ద్వారా యోగ యొక్క ఉపయోగాలు, వాటీ మేలుకోలు, ఆసనాలు వేసి నేర్పించడం జరిగిందనీ అన్నారు.
ఈ సందర్భంగా యోగ ఆసనాలు వాటి ఉపయోగాలు తదితరులు వివరించడం జరిగింది. ప్రిన్సిపాల్ వై కృష్ణ యోగ గురువు మోహన్ రావు మాట్లాడుతూ ప్రతిరోజు వ్యాయామంతో పాటు యోగ కూడా చేసుకున్నట్లయితే రోజంతా ఆరోగ్యం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందని కాబట్టి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లు ప్రతిరోజు ఉదయం ఒక గంట యోగ చేసినట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కం ప్రిన్సిపాల్ ఎర్రమిల్లి కృష్ణ, ఆర్ఎస్ఎస్ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కరాటే టీచర్ కిరణ్ జ్యోతి, పిఈటీ శంకర్, ఉపాధ్యాయులు జితేందర్, గణేష్, స్టాప్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు.