ప్రగతిలో దేశానికి దిక్సూచి
తెలంగాణ:మంత్రి కేటీఆర్

- తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది
- అభివృద్ధి, సంక్షేమం, జనహితమే మామతం
- అభివృద్ధి పనులు చూసి ప్రతిపక్షాల గుండెలు జల్లు మనడం ఖాయం
- కేబుల్ బ్రిడ్జి నుండి సదాశివ పల్లి వరకు లైటింగ్ ఏర్పాటుకు 20 కోట్లు మంజూరు.
కరీంనగర్, జూన్ 22 (విశ్వం న్యూస్) : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లో తెలంగాణ దేశానికి దిక్సూచి నిలిచిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం కరీంనగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించిన అనంతరం కరీం నగర్ కు పర్యాటక శోభ తీసుకువచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం మానేరు నది తీరాన ప్రతిష్టా త్మకంగా నిర్మించిన 500 మీటర్ల పొడవు గల కేబుల్ బ్రిడ్జిని మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిం చారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ… కరీంనగర్ 220 కోట్లతో కట్టిన కేబుల్ బ్రిడ్జి, 485 కోట్లతో అభివృద్ది చేస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను చూస్తే ప్రత్యర్ధుల గుండే జల్లుమంటోందని అన్నారు. అనాటి సాగు,త్రాగు నీళ్లు, కరెంటు కష్టాలు, రహాదారుల స్థితి అద్వానంగా ఉండేనని, ఇప్పుడు అద్బుతంగా వాటిని అభివృద్ది చేయడం జరిగిందన్నారు. సృజలదృశ్యమైన మానేరు నేడు అభివృద్దికి తార్కాణంగా నిలిచిందన్నారు. మానేరు సజీవ సుజలదృశ్యంగా మారి కనువిందు చేయనుం దని అన్నారు. ఎన్నటికి ఎండిపోని విధంగా తెలంగా ణను కోటినర ఎకరాల మాగానిగా కాళేశ్వరం, పాల మూరు ఎత్తిపోతల పథకంతో అభివృద్ది చేసుకోవడం జరిగిందన్నారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, చొప్పదండి, మానకొండూర్ శాసనసభ్యుల సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, నగర మేయర్ సునీల్ రావు, సూడా చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణారావు, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్ట్రటరి సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, సిపి సుబ్బారాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎమ్మెల్సి పాడి కౌశిక్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణ్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు, నగరవాసులు, తదితరులు పాల్గొన్నారు.
