హుజరాబాద్:మాకొద్దు రా
నాయన… కేసీఆర్ పాలన
- కాంగ్రెస్ తలపెట్టిన దశాబ్ది దగా కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు
- బల్మూర్ వెంకటకు పోలీసులకు వాగ్వివాదం
హుజరాబాద్ ఆర్సి, జూన్ 22 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దశాబ్ది దగా కార్యక్రమంలో కెసిఆర్ దిష్టిబొమ్మను దహనం చేసే క్రమంలో ర్యాలీగా వస్తున్న ఎన్ఎస్ యు ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోగా బల్మూర్ వెంకటకు పోలీసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ నిరసన వ్యక్తపరిచే హక్కులను కూడా తెలంగాణ ప్రభుత్వం కాలరాస్తుందని ఆస్పత్రులను పట్టించుకోని ప్రభుత్వం వైకుంఠధామాలను మెరుగుపరుస్తున్నామని చెప్పుకుంటుందని ఇంత దౌర్భాగ్యం తెలంగాణలో దాపరించిందని అన్నారు.
ఈ క్రమంలో ఎట్టకేలకు ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు పోలీసుల అడ్డునుచేదించుకుని కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తూ మాకద్దురా నాయన కెసిఆర్ పాలన అంటూ నినాదాలు చేశారు.