హైదరాబాద్

బోడుప్పల్ నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో యోగా దినోత్సవ వేడుకలు

బోడుప్పల్ నారాయణ కాన్సెప్ట్
స్కూల్లో యోగా దినోత్సవ వేడుకలు

ముఖ్య అతిథులుగా ఏజీఎం బాల పరమేశ్వర్,
ప్రిన్సిపాల్ సత్య వాణి హాజరు
బోడుప్పల్, జూన్ 24 (విశ్వం న్యూస్) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వినాయక నగర్, విజయపురి కాలనీల పరిధిలో ఉన్నటువంటి నారాయణ కాన్సెప్ట్ స్కూల్ ప్రాంగణంలో యోగ ఇంటర్నేషనల్ డే సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగ గురువులు సురేందర్,చందు, నవీన లు విచ్చేసి యోగ వాటి ప్రాముఖ్యత ఆసనాలు వాటి వల్ల విద్యార్థిని విద్యార్థులకు కలిగే ఉపయోగాలు, లాభాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థుల చేత యోగాసనాలు పద్మాసనం, చక్రాసనం తదితర ఆసనాలు వేయించి వాటి ఉపయోగాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిదులుగా హాజరైన ఏజీఎం బాల పరమేశ్వర్, ప్రిన్సిపాల్ సత్య వాణి, ఈ చాంప్స్ కో ఆర్డినేటర్ లక్ష్మీ భవాని విచ్చేసి విద్యార్థిని విద్యార్థులు చేసిన యోగాసనాలు, వాటి ప్రదర్శనలు తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి విద్యార్థిని విద్యార్థులకు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, యోగ చేయడం వల్ల చదువుతోపాటు ఏకాగ్రత పెరిగి అన్ని రంగాల్లో రాణిస్తారని పేర్కొన్నారు.

కాబట్టి ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఉదయం ఒక గంట సమయం కేటాయించి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రోటోకాల్ అనుసరించి ఒక గంట కేటాయించి ఉదయం వాకింగ్, యోగ, ఎక్సైర్సైజ్ లాంటివి చేసుకుని తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం యోగ గురువులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఓ శ్రీనివాస్, స్టాప్ సిబ్బంది విద్యార్థులనీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *