హైదరాబాద్

సమాజ స్వచ్చంధ సేవతో పరిమళిస్తున్న మానవత్వం

సమాజ స్వచ్చంధ సేవతో
పరిమళిస్తున్న మానవత్వం

ఎ.బి.సి లాఫింగ్ క్లబ్ యోగ గురువు సుధాకర్ గౌడ్
హైదరాబాద్, జూన్ 24 (విశ్వం న్యూస్) : సామాజిక స్వచ్చంధ సంస్థలు దేశ ప్రగతికి సామాజిక మార్పుకు స్వచ్ఛందంగా తమ వంతు సేవ చేయడం ద్వారా సమాజంలో మానవత్వం పరిమళిస్తుందని ఎ.బి.సి
లాఫింగ్ క్లబ్ యోగ సెంటర్ అత్తాపూర్ యోగ గురువు సుధాకర్ గౌడ్ అన్నారు.

నేడు రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలో గల అత్తాపూర్ జి.హెచ్.ఎం.సి లక్ష్మీనగర్ పార్కులో ఎ.బి.సి లాఫింగ్ క్లబ్ యోగ సెంటర్ అత్తాపూర్ అధ్వర్యంలో ‘అంతర్జాతీయ ప్రజా సేవల వారోత్సవాల’ సందర్భంగా ‘సమాజమార్పు సామాజిక స్వచ్చంధ సంస్థల పాత్ర’ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన యోగ గురువు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సమాజానికి మేలుచేయాలని అన్నారు. ఈ శమావేశంలో సభ్యులు ఈరమల్ల బాలకృష్ణ గారి 45 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయి సీత బాలకృష్ణ గారి చిత్ర పటాన్ని బాలకృష్ణకు జ్ఞాపిక గా బహుకరించారు. బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎ.బి.సి లాఫింగ్ క్లబ్ అత్తాపూర్ యోగ సెంటర్ అధ్యక్షులు, వ్యవస్థాపకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ బి.సీతారాం, డాక్టర్ బి.భానుమతి, యోగ సెంటర్ కన్వీనర్లు సుధాకర్ గుప్త, పి.మహేందర్, యోగ సెంటర్ సభ్యులు నేదునూరి కనకయ్య, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రభాకర్, సోమేశ్వర రావు, బ్రహ్మానందం, శ్రీనివాస్, శ్రీ శైలం, నరసింహ, అరుణ్, శ్రీనివాస్, గాయత్రి, సమంత, పి.లక్ష్మి, సుజాత, జయసుధ, పావని, సుజాత గుప్త, ఎన్ సరిత, సాయి, సీత శాంతి, సోనీ, ఈరమల్ల సుజన్, ఈరమల్ల సిద్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *