ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల
కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్
గుండెపోటుతో మృతి

హైదరాబాద్, జూన్ 29 (విశ్వం న్యూస్) : ప్రముఖ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి చెందారు. నిన్న సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ కి వచ్చిన సాయిచంద్. తన ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి అస్వస్థకు గురైన సాయిచంద్. చికిత్స కోసం నాగర్ కర్నూల్ గాయత్రి ఆసుపత్రికి తీసుకొచ్చిన కుటుంబసభ్యులు. గుండెపోటుతో గాయత్రి ఆస్పత్రిలోనే మృతి. సాయిచంద్ భార్య రజని కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు. సాయిచంద్ మృతిని నిర్ధారించిన గచ్చిబౌలి కేర్ ఆస్పత్రి వైద్యులు.

సాయిచంద్ మృతిపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నాను. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర. తన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్దిస్తున్నాను.
