మేడిపల్లి విహారిక కాలనీ
నూతన కార్యవర్గం ఏకగ్రీవం

హైదరాబాద్, జూలై 2 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ విహార కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విహారిక కాలనీ చైర్మన్ గా మాజీ ఉప సర్పంచ్ బండారి రవీందర్, అధ్యక్షులుగా సంగెపాక సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా పుట్ట యాదగిరి రెడ్డి, కోశాధికారిగా జి శ్రీనివాస్ నాయక్, అడ్వైజర్లుగా వి సురేష్ నాయక్, ఏవి రమణారెడ్డి, రమేష్ చారి, ఆర్ వెంకటేష్ రెడ్డి, ప్రదీప్ కుమార్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ మేరకు నూతనంగా ఎన్నికైన చైర్మన్ బండారి రవీందర్ మాట్లాడుతూ 15వ డివిజన్ పరిధిలోని విహారిక కాలనీ అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే విహారక కాలనీ సభ్యులందరూ కలిసికట్టుగా ఉన్నట్లయితే అభివృద్ధి సద్య, స్థానిక కార్పొరేటర్ బండారి మంజుల అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుధాకర్, యాదగిరి రెడ్డిలు మాట్లాడుతూ మా మీద నమ్మకం పెట్టి మాకు ఈ అవకాశం కట్టబెట్టిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ వంశీకృష్ణ, స్థానిక కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ లతో మమేకమై కాలనీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని, కాలనీలోని ప్రతి ఒక్కరు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల లాగా భావించి, ప్రతి సమస్యను మా దృష్టికి తీసుకురావాలని, సాధ్యమైనంత మేరకు సమస్యను పరిష్కరించే విధంగా సాయి శక్తులా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ ప్రజలు, విహారిక కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.