పెంచిన వేతనాలను వెంటనే
చెల్లించాలి: సాహెబ్ హుస్సేన్

వీణవంక, జూలై 3 (విశ్వం న్యూస్) : మధ్యాహ్న భోజన కార్మికులకు గత 8 నెలల క్రితం పెంచిన వేతనాలను వెంటనే విడుదల చేయాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. మార్చి నెలలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వెయ్యి రూపాయల నుండి 3000 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు.
అప్పటి వారి ధర్నాను విరమింప జేశారు అప్పటినుండి నేటి వరకు పెంచిన వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు చిన్నచితక కుటుంబాలు కుటుంబ పోషణ గడవక మధ్యాహ్న భోజన పథకంలో చేరి పిల్లలకు వంట చేసి కడుపు నింపుతున్న కార్మికుల పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం తక్షణమే పెంచిన జీతాలను వారికి ఇవ్వాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి చేస్తామని ఎండి సాహెబ్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వంన్ని డిమాండ్ చేశారు.