మొహర్రం ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

మొహర్రం ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్, జూలై 3 (విశ్వం న్యూస్) : మొహర్రం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. అన్నీ శాఖ అధికారుల సమన్వయంతో మొహరం వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రతీ పండుగను ప్రభుత్వ పరంగా భక్తి భావంతో జరుపుకునే విధంగా సహకరిస్తున్నారని చెప్పారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్‌ బాషా ఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్‌, రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహమ్మద్‌ సలీం, మైనారిటీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అహ్మద్‌నదీం, నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *