
- మార్నింగ్ వాక్ చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. తల్లీకూతురు మృతి
బండ్లగూడ జాగీర్, జూలై 4 (విశ్వం న్యూస్) : బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు ఓవర్ స్పీడ్ తో మార్నింగ్ వాకర్స్ మీదికి దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కారు వేగంగా ఢీకొట్టడంతో బాధితులు సమీపంలోని చెట్ల పొదల్లోకి ఎగిరిపడ్డారు. దీంతో ఓ తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. మృతులను అనురాధ, మమతగా గుర్తించారు. బాధితులు శాంతి నగర్ కాలనీకి చెందిన వారు గుర్తించారు. నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు.

