ఘనంగా వైయస్సార్ జయంతి

ఘనంగా వైయస్సార్ జయంతి

హుజురాబాద్, జూలై 8 (విశ్వం న్యూస్) : ఈరోజు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 74 వ జయంతి ఉత్సవాలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు 108 ,104 గాని విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ గాని పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కానీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిందని వారు తెలిపారు.

రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటితోపాటు మరిన్నిక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరుతాయని తెలిపారు.ఈ సందర్భంగా వైయస్ పరిపాలన గుర్తుచేసుకుంటూ వారికి ఘనంగా జన్మదిన వేడుకలను జరిపి కేకు మరియు స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, జిల్లా ఉపాధ్యక్షురాలు సుశీల, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, టౌన్ మైనార్టీ అధ్యక్షులు ఎం.డి అప్సర్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మూగల రాజి రెడ్డి , అప్పల రఘుపతి, కుర్ర శ్రీనివాస్ గౌడ్, కిరణ్ రెడ్డి, ఎర్ర శ్రీను ,సునీత, లక్ష్మి, విజేందర్, సుంకరి రాజేందర్,ఐలయ్య, చాంద్ పాషా, రియాజ్, ఎండి. కయూం తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *