ఘనంగా వైయస్సార్
74వ జయంతి వేడుకలు

ఇల్లంతకుంట, జూలై 8 (విశ్వం న్యూస్) : జనహృదయనేత మరపురాని మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 74 వ జయంతి కార్యక్రమం ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇంగిలే రామారావు గారి ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రామారావు గారు మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహానేత ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ 108104 ఉచిత కరెంటు జల యజ్ఞం పొదుపు సంఘాలకు పావలా వడ్డీ లాంటి పథకాలను భారీ ప్రాజెక్టులు రోడ్లు 20 పైగా వర్సిటీలను ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ బండి మల్లేష్, శనిగరపు రాము, పైడిపల్లి దేవేందర్, వంశీ, గుండ్ల వెంకన్న, NSUI మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.