సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్

సాయిచంద్ దశదిన కర్మ
కార్యక్రమంలో సీఎం కేసీఆర్

హైదరాబాద్, జూలై 9 (విశ్వం న్యూస్) : ప్రముఖ తెలంగాణ ఉద్యమ గాయకుడు రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా పని చేస్తూ అకాల మరణం చెందిన వేద సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.

హస్తినాపురంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ గారు సాయి చందు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. పూలు చల్లి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయి చంద్ తండ్రి వెంకట్ రాములు ను, భార్య రజిని మరియు కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. శోకతప్త హృదయయులైన కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ లు జోగినపల్లి సంతోష్ కుమార్, రాములు వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్ సుధీర్ రెడ్డి, దానం నాగేందర్,ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గ్యాదర్ కిషోర్, హరిప్రియ నాయక్, తదితర ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నేతలు, సాయిచంద్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *