తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని

శ్రీ ఉజ్జయిని మహంకాళి
అమ్మవారికి తొలి బోనం
సమర్పించిన మంత్రి తలసాని

  • హైదరాబాద్‌లో మొదలైన లష్కర్ బోనాల సందడి..

హైదరాబాద్, జూలై 9 (విశ్వం న్యూస్) : ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆషాడ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని కుటుంబ సభ్యులు.

2014 నుండి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.

అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం మొత్తం ఆరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బాటా చౌరస్తా నుంచి ఆలయానికి వచ్చే లైన్‌, ఎంజీ రోడ్డు రాంగోపాల్‌పేట్‌ పాత పోలీస్‌స్టేషన్‌ కొత్త ఆర్చీ గేట్‌ నుంచి మహంకాళి పోలీస్‌స్టేషన్‌ మీదుగా ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌ అంజలి టాకీస్‌ వైపు నుంచి వీఐపీలకు-1, సాధారణ భక్తులకు-1 క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *