కేటీఆర్ క్షమాపణ చెప్పాలి:వైద్యుల అంజన్ కుమార్ డిమాండ్

కేటీఆర్ క్షమాపణ చెప్పాలి:వైద్యుల
అంజన్ కుమార్ డిమాండ్

  • రాహుల్ గాంధీ పై వక్రభాషల వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ వెంటనేవెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని: పిసిసి రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ డిమాండ్

కరీంనగర్, జూలై 18 (విశ్వం న్యూస్) : దేశం కోసం నెహ్రూ, గాంధీ కుటుంబీకులు పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇచ్చి ప్రాజెక్టులు కట్టి కరువుతో అల్లాడుతున్న దేశంలో ఆకలి చావును ఆపి, దేశప్రజల ఆకలి తీర్చడమే కాక విదేశాలకు తిండి గింజలను ఎగుమతిచేసేలా చేసిన రాహుల్ గాంధీ కుటుంబానికి పొలం తెలుసా ఎడ్లు తెలుసా అంటావా కేటీఆర్?. కేటీఆర్ ఎడ్లు కట్టి, పొలందున్ని, నాట్లు ఏసి, ధాన్యం పండించి తన బియ్యం తానే ఉత్పత్తి చేసుకొని తింటున్న పెద్ద రైతు కేటీఆర్ అని తనకు తానే ఫీల్ అవుతున్నాడు.

కేటీఆర్ ఎమ్మెల్యేగా వున్నప్పుడు సిరిసిల్ల నియోజకవర్గములోని ముస్తాబాద్ మండలంలోని. గూడెం అనే గ్రామములో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేసిన IKP కొనుగోలు కేంద్రానికి పోయినప్పుడు అక్కడి రైతులు గొనె సంచులు రాలేదని కేటీఆర్ ను అడిగితే గొనె సంచి అంటే ఏంది అని ఆయన బాబాయిని అడిగి తెలుసుకున్నడు అప్పటి వరకు నీకు తెలువది, నాకు బార్ధను అంటే తెలువది అని కేటీఆర్ స్వయంగా సిరిసిల్ల మీటింగ్ లో చెప్పిండు ఇప్పుడు రాహుల్ గాంధీకి వ్యవసాయం గురించి ఏం తెలువదనడం సిగ్గు చేటు.

భారత్ జోడోయాతో ద్వారా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3600 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా రైతులను కర్షకులను కార్మికులను అనేక వర్గాలను కలిసి వాళ్ళ బాధలు తెలుసుకున్ననాయకుడు గురించి మాట్లాడడం వారి గురించి వక్రంగా మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అంజన్ కుమార్ డిమాండ్ చేస్తూ ఐకేపీ ద్వారా వడ్లను కొనే పద్ధతిని ప్రవేశపెట్టినది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయమ కేటీఆర్ కు తెలువదని తెలియజేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *