కేటీఆర్ ది రాహుల్ గాంధీని
విమర్శించే స్థాయి కాదు

- నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్
కరీంనగర్ బ్యూరో, జూలై 18 (విశ్వం న్యూస్) : అభివృద్ధి చాటున జరిగే అవినీతిని ప్రజలలోకి తీసుకెళ్తామని కూడళ్ల సుందరీకరణలో కోట్ల రూపాయల స్కాం జరుగుతుందని,సర్క్యూట్ గెస్ట్ హౌస్ కు పదిహేను కోట్లు ఖర్చయినట్టు చూపిస్తున్నారని పేదల డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి చేయడానికి నాలుగు కోట్లు ఖర్చు చేయడానికి మంత్రికి మనసు రావడంలేదని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివారు కాలనీలు,విలీన గ్రామాల పరిధిలో పైప్ లైన్లు వేయక పోవడం వల్ల మంచి నీళ్లకు ఇబ్బందులు పడుతున్నారని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని నగరంలో చాలా ప్రాంతాలలో రోడ్లు మురికి కాలువలు దెబ్బ తిని ఉన్నాయని అన్నారు.దెబ్బతిన్న ఫుట్ పాత్ లు నాణ్యత లోపంతో స్మార్ట్ సిటీ రోడ్లు కూలిపోయిన పబ్లిక్ టాయిలెట్లు అన్నిటి ఫోటోలు ప్రదర్శించారు.మసిపూసి మారేడు కాయ చేసి చూపించి ఇదే అభివృద్ధి అని చెప్తున్నారని కాజిపూర్ వక్ఫ్ బోర్డు ఆస్తి కాజేసినట్టు పూర్తి ఆధారాలున్నాయని అన్ని కూడా ప్రజలకు డాక్యుమెంట్ రూపంలో అందజేస్తామని ప్రజలే న్యాయనిర్ణేతలు అని కోమటిరెడ్డి అన్నారు.

జగిత్యాలలో మంత్రి కెటి రామారావు స్థాయికి మించి మాట్లాడాడని రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి ఆయనది కాదని అన్నారు.ఎద్దు ఏవుసమే కాదు ఈ దేశానికి దిక్సూచి కూడా రాహుల్ గాంధీయే అన్నారు. సిరిసిల్ల లో కెకె మహేందర్ రెడ్డి నోటి కాడి బుక్క గుంజుకొని ఎమ్మెల్యే అయిన కెటిఆర్ రెండు సార్లు ప్రధాన మంత్రి అవకాశం వచ్చినా వదిలి పెట్టిన రాహుల్ గాంధీని విమర్శించడ మెంటనీ నరేందర్ రెడ్డి ప్రశ్నించారు.ఈ విలేకరుల సమావేశంలో సమద్ నవాబ్, శ్రవణ్ నాయక్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దండి రవీందర్, సలిమొద్దిన్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, ఊరడి లత, దన్న సింగ్,మామిడి సత్యనారాయణ రెడ్డి, చంద్రయ్య గౌడ్, ముక్క భాస్కర్, లయక్, కంకణాల అనిల్ కుమార్, మెతుకు కాంతయ్య, షేక్ శేహెన్ష, రాజ్ కుమార్, కాంపల్లి కీర్తి కుమార్, ఇమామ్,అశ్రాఫ్, తమ్మడి ఎజ్రా, అబ్దుల్ భారీ, హనీఫ్, హాసన్ తదితరులు పాల్గొన్నారు.