ప్రకృతిని, పశువులను పూజించే గొప్ప పండుగ కనుమ : మంత్రి ఎర్రబెల్లి

హైదరాబాద్, జనవరి 16 (విశ్వం న్యూస్) : పశువులు, ప్రకృతిని పూజించే గొప్ప పండుగ కనుమ అని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశ రైతన్నలు ఈ సంక్రాంతి, కనుమ పండుగలను సుఖసంతోషాలతో చేసుకునేందుకు కేసిఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేశారని, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి, ఆశీర్వదించాలని మంత్రి కోరారు.