మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ

హైదరాబాద్, జూలై 23 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఆదివారం రోజున ఎడతెరిపిలేని వాన కొంత విశ్రాంతి తీసుకుంది. దీంతో ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. బయటికి వచ్చి పనులు చేసుకున్నారు. అయితే, రానున్న మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది.

ఈ నెల 25,26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ మేర‌కు మంగ‌ళ‌, బుధ‌వారాల్లో వాతావ‌ర‌ణ శాఖ ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది.

24వ తేదీన ఒక అల్ప‌పీడ‌నం ద‌క్షిణ ఒడిశా –ఉత్త‌ర ఆంధ్రా ద‌గ్గ‌ర‌లోని వాయవ్య బంగాళాఖాతం ప‌రిస‌రాల్లో ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ మేర‌కు గంట‌కు 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *