కన్నీరు పెట్టుకున్న సీతక్క

  • వరదముంపులో గ్రామాలు
  • మాకో హెలికాప్టర్ ఇవ్వండి

ములుగు, జూలై 27 (విశ్వం న్యూస్) : మాకో హెలికాప్టర్ ఇవ్వండని చెబుతూనే ఉన్నాం. ఇప్పటి వరకు ఎంత మంది ఉన్నరో.. ఎంతమంది పోయారో తెలియదు. మంత్రి కేటీఆర్ గారి కోసం మేం ట్రైం చేశాం. మంత్రి సత్యవతి రాథోడ్‌తోనూ మాట్లాడినం. వాగు దాటకం రెస్క్యూ టీం వాళ్ల కావటంలేదు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు వెనక్కి వచ్చేశాయి. ఒక హెలికాప్టర్ ఇచ్చివారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాం. అటు మూడు గ్రామాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా వంద మంది చాలా డేంజర్‌లో ఉన్నరు.

ఇప్పటికైనా యుద్ధప్రతిపాదికన ఈ ప్రాంత ప్రజలను కాపాడటం కోసం హెలికాప్టర్‌ను ఇవ్వాలి. ఈ ఊర్ల చూట్టూ చెరువులు, వాగులే ఉన్నయ్. ఇప్పటికే పలు గ్రామాల్లో కుటుంబాలు కొట్టుకుపోయినయ్. ఇప్పుడు ఏటూరు నాగారం కొండాయిలో ఆరుగురు కొట్టుకుపోయారు. మరో వంద మంది ప్రమాదంలో ఉన్నరు. చుట్టూ వాగులే ఉన్నయ్. వాళ్లు ఎటూ రాలేని పరిస్థితి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ములుగు ప్రాంతాలనికి ప్రత్యేకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంత ప్రజలను కాపాడాలని చేతులెత్తి మెుక్కుతున్నా.” అని సీతక్క కన్నీరు పెట్టుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *