మానకొండూర్ కాల్పుల కేసులో ప్రధాన నిందితుని అరెస్ట్

మానకొండూర్ కాల్పుల కేసులో
ప్రధాన నిందితుని అరెస్ట్

కరీంనగర్ బ్యూరో, ఆగస్టు 3 (విశ్వం న్యూస్) : మానకొండూరూ మండల కేంద్రంలో జరిగిన తుపాకీ పేలుడు సంఘటనలో ప్రధాన నిందితుడిని గురువారం నాడు పోలీస్ కమిషనర్ ఎల్. సుబ్బ రాయుడు సమక్షంలో  పోలీసులు అరెస్ట్ చూపించారు. ఈ సంఘటనలో మరో  నిందితుడిని  గతంలోనే పోలీసులు అరెస్ట్  చేసిన విషయం విదితమే. గోదావరిఖని లోని జీఎం కాలనీ కి చెందిన వీణవంక సాయితేజ (27) చెల్లెలు ఆత్మహత్య చేసుకుని మరణించడానికి మానకొండూరుకు చెందిన భాషబోయిన అరుణ్ (35) ప్రధాన కారకుడంటూ మనసులో కక్షపెంచుకుని తన స్నేహితులయిన, మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన కందుల ప్రదీప్ (25) @ చంటి @ ఆర్య, భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతానికి చెందిన పాల మల్లేశంలతో కలిసి గత ఏప్రిల్ 19 న హైదరాబాద్ నుండి ద్విచక్ర వాహనంపై మానకొండూరుకు వచ్చి అదే రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో  భాషబోయిన అరుణ్ (35) పై, గతంలో ఢిల్లీలో అక్రమంగా కొనుగోలు చేసిన నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దాడిలో నాటు తుపాకీ పేలకపోవడంతో భాషబోయిన అరుణ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనలో నిందితుడు  పాల మల్లేశం ను గతంలోనే అరెస్ట్  చేయడం జరిగింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన వీణవంక సాయితేజ పై హైదరాబాద్ నగరంలోని అల్వాల్, నల్లకుంట, మంచిర్యాల జిల్లా జైపూర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పోలీస్ స్టేషన్ లలో మత్తు, మాదక పదార్థాల వినియోగం, అక్రమ రవాణాకు సంబంధించిన  పలు కేసులు నమోదయివున్నాయని ఈ కేసు లో ప్రధాన నిందితుడైన వీణవంక సాయితేజ కదలికలపై నిఘా ఉంచి పక్కా సమాచారంతో గురువారంనాడు  మానకొండూరు ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్  ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ ప్రాంతంలో పట్టుకోవడం జరిగిందని ఈ సంఘటనలో ఒక నాటు తుపాకీ రెండు తూటాలను స్వాధీన పరుచుకోవడం జరిగిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *