స్నేహం ఓ వరం

స్నేహం ఓ వరం

  • (ఆగస్టు 6 అంతర్జాతీయ స్నేహ దినోత్సవం సందర్భంగా)

హైదరాబాద్, ఆగస్టు 6 (విశ్వం న్యూస్) : స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా
స్నేహం ఆనందానికి అడ్రస్
స్నేహం అనుబంధానికి అడ్డ ‌
ఇచ్చింది మరిచి పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం
ఆపదలో ఆదుకోవడం
అపాయం లో అక్కున
చేర్చుకునేది స్నేహం
అనుకోవడం అడ్జస్ట్ కావడం
స్నేహం పిలుపులో ప్రేమ
మాటలో మాధుర్యం
బంథములో అనుబంధం
విభేదాలు ఎన్ని వున్న
విడిపోనిది స్నేహ బంథం
విఫణిలో దొరికనిది
వ్యాకులతను తొలిగించేది
ఆందోళన తుంచేది
ఆనందాన్ని పెంచేది స్నేహం
హల్లో అంటూ హాయి నిచ్చేది
పలుకుతో మదిని పులకరింప
చేసేది స్నేహం
స్నేహితుని మాట మనోల్లాసానికి ఊట
స్నేహానికి మించిన ఆస్తిలేదు
ధైర్యం ఓథార్పు నిచ్చేది స్నేహం
కలత చెందిన మనసుకు
వెన్నల్లా చల్లదనాన్ని
ప్రశాంతతను చేకూర్చే
దివ్యౌషధం స్నేహం
కంటికి దూరమైన
మనసుకు దగ్గరుండేది స్నేహం
ఎల్లలు ఎరుగనిది
సరిహద్దులను చేరపేస్తుంది
కుల మతాలను వెతకనిది
కులాసాను కోరుకునేది స్నేహం
పగలు పట్టింపులు ప్రతీకారాలు
కుట్రలు కుయుక్తులు పన్ననిది స్నేహం
త్యాగాలకు తరగని నిధి స్నేహం
మమతాను రాగాలమాలిక స్నేహం
స్వార్థం ఎరగనిది స్నేహం
సాయం చేసేది స్నేహం
స్నేహం అనేది శాశ్వతం
కల్మషం కలహాలు కల్లా కపటం ఎరుగనిది స్నేహం
జీవిత ఉద్యాన వనములో
అందమైన పుష్వం స్నేహం
ప్రతిఫలాన్ని ఆశించనిది
ఇరువురి మనసుల భంథం
స్నేహ భంథం ‌ ‌
స్నేహితుని మాట
మానసికారోగ్యానికి బాట
స్నేహం తరతరాల వారధి
స్నేహమే జీవనశైలిలో భాగమైతె ప్రశాంతత జీవన సౌరభమౌతది
స్నేహాశీలత సామాజిక సమరసతకు దారి కావాలి
స్నేహంచేయడం కన్న
స్నేహం నిలుపుకోవడం మిన్న
స్నేహమనే తోటలో
ప్రేమానురాగాలను పూయిద్దాం
సౌభ్రాతృత్వ సొగసులతో
మానవీయతను పరిమళింప చేసే
2023 స్నేహ దిన నినాద మైన
స్నేహంతో మానవాళికి స్ఫూర్తిని పంచుదాం
స్నేహాన్ని ఆస్వాదిధ్దాం ఆనంద తీరాల
విహరిధ్దాం
స్నేహ దీపం వెలుగులో ఉగ్రవాదాన్ని
అరికడుదాం దేశాల మధ్య స్నేహ కపోతం ఎగిరేధ్దాం
ప్రపంచ శాంతికి ప్రగతికి పురోగతికి పాటుపడుదాం

నేదునూరి కనకయ్య
తెలంగాణ ఎకనామిక్ ఫోరం, అధ్యక్షులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *