అనాధ పిల్లలకు ఆర్థిక సాయం

అనాధ పిల్లలకు ఆర్థిక సాయం

10,000/- సాయం చేసిన చదువు నారాయణరెడ్డి
వీణవంక, ఆగస్టు 30 (విశ్వం న్యూస్) : వీణవంక మండలలోనీ బొంతుపల్లి గ్రామనికీ చెందిన రాముల సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం జరిగింది వారికీ ఇద్దరు పిల్లలు శ్రీరాముల రమ్య, రాజకుమార్ ఉన్నారు. వారు ఒకే సంవత్సరంలో తల్లితండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు.

ఈ విషయంను బొంతుపల్లి మాజీ సర్పంచ్ లు జనార్దన్ రెడ్డి,రాజ్ కుమార్ లు రహమత్ నగర్ కార్పొరేటర్ చదువు నారాయణరెడ్డి, (సి ఎన్ రెడ్డికి) తెలియజేయగా వారి కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 10,000/- పదివేల రూపాయలను సిఎన్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొంతుపల్లి మాజీ ఉపసర్పంచ్ జితేందర్ రెడ్డి, చదువు కోమల్ రెడ్డి, శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *