ప్రమోషన్లు వెంటనే ఇవ్వండి

- తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం సి ఎస్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ సెక్రటరీలకు సంఘం పక్షాన రిప్రెసెంటేషన్ ద్వారా విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 30 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో ఇటీవల జరిగిన అధికారుల బదిలీలలో గతంలో చాలా మంది ప్రమోషన్ తీసుకున్న వారికి కూడా ఈ మధ్యకాలంలో వారిని కూడా బదిలీలు చేస్తూ పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల ఆసిఫాబాద్ కొత్తగూడెం మహబూబాబాద్ సిద్దిపేట్ కామారెడ్డి బోధన్ మెదక్ భూపాల్ పల్లి ములుగు నర్సంపేట జనగాం మంచిర్యాల్ ప్రాంతాలలో ఉన్న వాణిజ్య పనుల శాఖ కార్యాలయంలో సి టి ఓ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల ఇదే వాణిజ్య పనుల శాఖలలో పనిచేస్తున్న ఉపవాణిజ్య పనుల అధికారులకు అదనపు బాధ్యతలుగా సిటిఓ పోస్టులలో తాత్కాలికంగా ప్రమోషన్లు ఇవ్వటం జరిగింది.
అదే ఎఫ్ఎసి పోస్టులో ఒక వ్యక్తికి డి సి టి ఓ నుండి సీటీవో అదనపుగా ఇచ్చిన ఎఫ్ఎసి పోస్టులో ఇన్చార్జిగా ఏ సి టి ఓ లకు డిసిటివోలుగా ఇంచార్జ్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అబిడ్స్ డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్ మరియు మూర్తి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర టి సి టి ఎన్జీవో సంఘం పక్షాన రిప్రెసెంటేషన్ అందజేయడం జరిగింది.

రాష్ట్రంలో ఉన్న ఖాళీ డి సి టి ఓ పోస్టులను తెప్పించుకొని ఎక్కడ ఎక్కడ డి సి టి ఓ లు అవసరం ఉన్న చోటు వెంటనే భర్తీ చేయడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు మా సంఘం పక్షాన ఇటీవల బదిలీ అయిన ప్రమోషన్లు పొందిన ఖాళీ స్థలాలలో ఎఫెసీగా డీసీటీవోలకు సీటివోలుగా తాత్కాలిక కల్పించిన ప్రమోషన్లను కాకుండా ఇన్చార్జిగా సీటీవో గా ఇచ్చినట్లయితే వారికిందా ఉన్న డి సి టి ఓ పోస్టు ఖాళీగా ఉంటుంది కదా అదే స్థానంలో సీనియర్ ఏసీటీవోలకు డిసిటివోలుగా ఇన్చార్జించినట్లయితే ఇదే వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు వారు కూడా ఇంచార్జ్ ఎసిటివోలుగా కొనసాగుతారు.
సీనియర్ అసిస్టెంట్లకు ఏ సిటీవోలుగా ఇచ్చిన సీనియర్ అసిస్టెంట్లకు కింద ఉన్న జూనియర్ అసిస్టెంట్లు ఇంచార్జ్ సీనియర్ అసిస్టెంట్లు కొనసాగుతారు కనుక ఇలాంటి అవకాశం వాణిజ్య పనుల శాఖలో కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ ఇన్ ఫోర్స్ మెంట్ శ్రీమతి జై కామేశ్వరి, తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ అడిషనల్ కమిషనర్ సెక్రెటరీ శ్రీమతి వై సునీతకు, తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సంఘం పక్షాన విజ్ఞప్తి చేశారు.
- వాణిజ్య పనుల శాఖలో ఇన్చార్జిగా ప్రమోషన్లు ఇచ్చినట్లయితే ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ ఆదాయం
- ఇన్చార్జి ప్రమోషన్లు ఇచ్చినట్లయితే ప్రభుత్వ ఖజానాకు రెవెన్యూ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఒక అధికారి డి సి టి ఓ మరియు సిటిఓ చూడాలంటే ఇబ్బందిగా ఉంటుంది కనుక ఒక అధికారికి ఒక పోస్టు ఇచ్చినట్లయితే ఆ పోస్టుకు అతను న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. డి సి టి ఓ గా మరియు సిటిఓ గా ఒక అధికారి పనిచేసినట్లైతే అతనిపై అధిక భారం పడుతుంది కనుక ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు రాష్ట్రస్థాయి అధికారులు ఇలాంటి అవకాశాన్ని వాడుకోవాలి ప్రభుత్వానికి ఎక్కువ రెవిన్యూ రావడానికి కూడా రాష్ట్ర స్థాయి అధికారులు ఆలోచించాలి ఒక అధికారి రెండు పోస్టులలో పని చేయాలంటే అతనికి అధిక భారం పడుతుంది కనుక తెలంగాణ రాష్ట్ర వాణిజపనుల శాఖ తెలంగాణ స్టేట్ టి సి టి ఎన్జీవోస్ సంఘ ఇచ్చిన రిప్రెసెంటేషన్ కూడా ఒక్కసారి రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఆలోచించాలని సంఘ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.