
- ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, మార్చి 22 (విశ్వం న్యూస్) : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ సంచలన వ్యా ఖ్యలు చేశారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్లో ఉన్నారని అన్నారు. ఆ ఎమ్మెల్యేలు తమ పార్టీ నేతలతో చర్చలు జరిపారని.. త్వరలోనే వాళ్లంతా కాంగ్రెస్లో చేరతారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రజా పాలన నచ్చే వారంతా తమ పార్టీలోర్టీకి చేరేందుకు సిద్దమద్ద య్యారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలర్టీ ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటున్నారని బీర్ల ఐలయ్య చెప్పారు.
కాంగ్రెస్ ఇంకో నాలుగు గేట్లు తెరిస్తే బీఆర్ఎస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున చేరేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయాల్సిన అవసరం తమకు లేదని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు.