మా కన్నీటి సాక్షిగా…

మా కన్నీటి సాక్షిగా…

హైదరాబాద్, మే 11 (విశ్వం న్యూస్) : ఉద్యమం ఉధృతిలో
ఉరకెత్తిన ఉరవడిలో
ఉసురలనర్పించినట్టి
యువరక్తం కొందరిది…
మా రాష్ట్రం కావాలని
మా బతుకులు మావేయని
పోరాటమె లక్ష్యమని
ప్రాణం తృణప్రాయమని
అరక్షణమాలిస్యమైన
ఆలోచన మారునని
అగ్నికి ఆహుతి జేసి
అసువులను కోల్పోయిన
అమరత్వం కొందరిది…
నేత అడుగుజాడల్లో
నాయకుని సూచనలతో
మనసా, వాచా, కర్మణః
మడమ తిప్పని నిర్మల
ప్రేమతో ముందుకు సాగే
అభిమానం కొందరిది.
అభిమానం, ఆరాధన
అంతకన్న గొప్పదైన
తెలియని ఓ భావన
బాపూ అంటే గౌరవం
కేసియారే సర్వం.
తన రుధిరారుణ వర్ణం
తడిపింది కుంచెను
వెలయించిందొక చిత్రం
అదే మన నాయకునికి
మనః పూర్వకార్పణం..
జయజయహో తెలంగాణ..!
జై జై కేసీఆర్….!!

చెరువులన్నీ నీరునిండి
కరువుదీరా పంటపండి
చేతినిండా డబ్బులుండీ
పరువులెత్తిన తెలంగాణా..
కర్షకులకు కార్మికులకు
వర్షములతో హర్షమొంద
“బాపు కేసీఆర్ “యిచ్చిన
భాగ్యవంతపు నజరానా…
రైతు వదనం వెలుగు పండి
రైతు బంధుతో కడుపు నిండి
రైతు బీమా యనగ దండి
కేసిఆర్ మా ముందునుండి
తీర్చిదిద్దిరిన్నాళ్ళనుండి …
గాలి వాన, దుమ్ము ధూళి
కలిసివస్తే బెదురుతామా…?
కలిసికట్టుగ అందరొకటై
తరిమి కొట్టమా దానవులను
మానవత్వం నిలుపుకోమా..?
మరల బాపును తెచ్చుకోమా…?
జై తెలంగాణా…!
జైజై బాపూ కేసియార్….!!

శ్రీదేవి మంత్రి
(తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *