తులసి వనంలో
గంజాయి మొక్క

- శ్రీదేవి మంత్రి (తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్)
మీరు జాగ్రత్తగా లేకపోతే
వార్తాపత్రికలు,టివి చానెళ్ళు
మిమ్మల్ని అణచివేతకు
గురికాబడుతున్న ప్రజల్ని
ద్వేషించేలా చేస్తాయి
అణచివేస్తున్నవారిని
ప్రేమించేలా చేస్తాయి.
హైదరాబాద్, మే 23 (విశ్వం న్యూస్) : ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయవృత్తి కీలకమైనది.
అందుకే దీన్ని “ఫోర్త్ ఎస్టేట్ “అంటారు. పాత్రికేయుడు వార్తలను స్వప్రయోజనంకోసం కాకుండా ప్రజా ప్రయోజన కోణంలో రాయాలి. వార్తల్లో సత్యం ఉండాలి,అబద్దాలకు తావుండకూడదు.
వార్తలు నిక్కచ్చిగా,నిర్బయంగా ఉండాలి. పాలకులకు,ప్రజలకు వారదిగా జర్నలిజం పనిచేయాలి.
పాలకుల దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడిన ఉత్తమవిలువలు కలిగిన పాత్రికేయులెందరో మన దేశంలో ఉన్నారు.
గుజరాత్ మారణహోమాన్ని వెలికితీయడానికి ప్రాణాలొడ్డి వార్తలను సేకరించిన రానా అయూబ్, జైలులో బంధింపబడి క్రూర నిర్భంద చట్టాలను ఎదుర్కొన్న తీస్తా సెతల్వాద్ లు పాత్రికేయరంగానికి ఆదర్శం కావాలి. మన తెలంగాణలో కూడా షోయబుల్లాఖాన్ నుండి ఎందరో ఉత్తమ పాత్రికేయులు కనబడుతారు.
ఎన్ కౌంటర్ పేర హత్యచేయబడ్డ గులాం రసూల్, టాడా చట్టాన్ని ఎదుర్కోన్న సోలిపేట రమలింగారెడ్డి లాంటి ప్రజా పాత్రికేయులు మన తెలంగాణనేలపై ఉద్భవించారు.
తులసివనంలో గంజాయిమొక్కలాగా తీన్మార్ మల్లయ్యలాంటి చీడపురుగులు కూడా పాత్రికేయరంగంలో ఉన్నారు. వీడు నిజానికి పాత్రికేయుడేకాదు, పాత్రికేయ ముసుగులో ఉన్న రాజకీయ బ్రోకర్. వీడు తన రాజకీయ ప్రయోజనంకోసం అనేకరకాల వేషాలు వేశాడు. వీడిని చూసి ఊసరవెళ్ళులు కూడా సిగ్గుపడుతాయి. అణువణువునా మనువు భావజాలం కలిగిన మల్లిగాడు అవసరంకోసం అంబేద్కర్ గారిని ఎత్తుకుంటాడు. బహుజానవాదమంటూ అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని నాలుగు ఓట్లు సంపాదించుకున్నాడు.
ఆ ఓట్లు తనను చూసే వేశారని అహంభావంతో విర్రవీగాడు. తను ఏంచేసినా చెల్లుబాటవుతుందనుకున్నాడు. తన అవినీతి అక్రమాలనుండి బయటపడడానికి ఎలక్షన్ అయిపోయిన తెల్లారే కాషాయ కండువా కప్పుకున్నాడు. ఇది వాడి అవకాశవాద రాజకీయాలు పరాకాష్ట. వీడిలో కులవాది కూడా ఉన్నాడు. తన కులంవాళ్ళైన బండిసంజయ్,అరవింద్ లను తప్ప అందరినీ దూషించాడు. కమ్యూనిస్టులను,ఉత్తమ్ ను,రేవంత్ ను,కోమటిరెడ్లను ఇలా ప్రతి ఒక్కరిని విమర్శించాడు. ఇగబాపు కేసిఆర్ గారి కుటుంబాన్నైతే ఎన్ని అనకూడదో అన్ని అన్నాడు. ఆ విషయాలను తలుచుకోకపోవడమే మంచిది. ఇట్లాంటి నీచుడు సమాజిక జీవితానికే పనికిరాడు. వీడిని చేరదీసిన కాంగ్రెస్ దివాళాకోరుతనాన్ని జనం ఈసడించుకుంటున్నారు.
పట్టబద్రులు మళ్ళీ మళ్ళీ మోసపోరు. అప్పుడు అంబేద్కర్ గారి పేరుమీద ఓట్లుపడ్డాయి. ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు చెబితే జనం చెప్పులతో కొడుతారు. మల్లయ్య ఆట ఇప్పుడే షురువయ్యింది. అడుగడుగునా వాడికి అవమానాలు ఎదురవుతున్నాయి. ఏం వర్గంకూడా అనుకూలంగాలేదు. ఈ స్థాయి దాడిని మల్లయ్య ఊహించలేదు. ఇగ ఈయన బతుకు ఏట్ల పడ్డట్టే!!! మల్లయ్య ఎందుకూ పనికిరాకుండా పోవడం ఖాయం.