ప్రభుత్వ ఆఫీసుల్లో చంద్రబాబు, పవన్ కల్యా ణ్ ఇద్దరి ఫొటోలు

ప్రభుత్వ ఆఫీసుల్లో చంద్రబాబు,
పవన్ కల్యాణ్ ఇద్దరి ఫొటోలు

హైదరాబాద్, జూన్ 15 (విశ్వం న్యూస్) : ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం .. మరో కీలక, సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసుల్లో సహజంగానే సీఎం ఫొటో ఉంటుంది. ఈసారి టీడీపీతోపాటు కూటమి ప్రభుత్వం ఉంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.

ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరి ఫొటోలు ఇక ప్రభుత్వ ఆఫీసుల్లో దర్శనం ఇవ్వనున్నాయి.

ఈ మేరకు I&PR అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. చంద్రబాబు పవన్ కళ్యా ణ్ కు తనతో సమానంగా హోదా ఇవ్వ డం పట్ల అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *