నూతన డివిజన్ మరియు సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలి

నూతన డివిజన్ మరియు సర్కిల్
కార్యాలయాలను ఏర్పాటు చేయాలి

  • తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజప్తి.

హన్మకొండ, జూన్ 15 (విశ్వం న్యూస్) : శనివారం హన్మకొండ TNGS యూనియన్ భవనంలో జరిగిన వరంగల్, ఖమ్మం, కరీంనగన్, అదిలాబాద్, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్ముల, కార్యవర్గ సభ్యుల సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ 2018 సంవత్సరములో వాణిజ్య పన్నుల శాఖలో రి ఆర్గనైజేషన్ సర్కిల్స్ లో భాగంగా (145. G ప్రకారం ) 18 సర్కిల్ ఆఫీసులా నుండి 21 సర్కిల్స్ పెంచినప్పటికీ క్యాడర్ స్టెర్త్ వర్కింగ్ స్టెర్త్ కు తేడాల వలన పూర్వపు ఐదవ జోన్ లోని మిగులు సిబ్బంది అనగా (12) DET పోస్టులు (37) AC పోస్టులు (8) sr అసిస్టెంట్ పోస్టులు పూర్వపు ఆరవ బోన్ నందు పనిచేయుటకు అవకాశం కలిపించారు.

పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వులు అనుగుణంగా పూర్వపు ఐదో జోన్ నందు సర్దుపాటు చేసే విదంగా నూతన డివిజన్ కార్యాలయము ఖమ్మం మరియు గోదావరిఖని, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అదేవిదంగా ఎక్కువైతే ముగ్గురు ACTలు పనిచేస్తున్నావద్ధ 4 గురికి పెంచాలని, 103 Go 15-9-200 ప్రకారం (39) పోస్టులకు గాను నూతనంగా (5) పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది.

నిష్పత్తి ప్రకారం అదనపు పోస్టులు మంజూరుచేయాలని, రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం పోస్టలను, నూతన కార్యాలయలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జివిజ అధ్యక్షుడు K.గోపి కిషోర్, సెక్రటరీ M.A.ముజిబ్, కరీంనగన్ డివిజన్ అధ్యక్షులు G.బిక్షపతి, ఆదిలాబాద్ అద్యక్షులు T.హరి కిషన్, రాష్ట్ర అద్యక్షులు MVN రమేష్, ప్రభాకర్, శ్రీనివాస్, B.రమేష్, బుద్రత్ అలీ, సాయి కృష్ణ, M.సునిత, P.ప్రవీణ, వరుధుని, అరుణ , జగదీష్, కృష్ణ వేణి, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *