మరో ఎమ్మెల్యేకు
కాంగ్రెస్ కండువా

హైదరాబాద్, జూలై 15 (విశ్వం న్యూస్) : ఇప్పటివరకు మొత్తం తొమ్మిదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి- స్టేషన్ ఘన్పూర్, దానం నాగేందర్- ఖైరతాబాద్, తెల్లం వెంకట్రావ్- భద్రాచలం, పోచారం శ్రీనివాసరెడ్డి- బాన్సువాడ, డాక్టర్ ఎం సంజయ్ కుమార్- జగిత్యాల, కాలె యాదయ్య- చేవెళ్ల, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి- గద్వాల, టీ ప్రకాష్ గౌడ్- రాజేంద్రనగర్, అరికెపూడి గాంధీ- శేరిలింగంపల్లి.. కాంగ్రెస్లోకి వలస వెళ్లారు.
ఇప్పుడు తాజాగా మరో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయించారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి కొద్దిసేపటి కిందటే రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు.