
- బోధన్ చలాన్ల కేసులో సస్పెండ్ అయిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులను మరియు ఉద్యోగులను తిరిగి విధులలో తీసుకోండి: తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 16 (విశ్వం న్యూస్) : తల్లి తండ్రులను, పిల్లలను దృష్టిలో పెట్టుకొని మానవతా దృష్టితో వాణిజ్య పన్నుల శాఖలో సస్పెండ్ అయిన ఉద్యోగులను తిరిగి విధులలో చేర్చుకొని వారి కుటుంబానికి న్యాయం చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
సస్పెండ్ అయిన ఉద్యోగులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మానసికంగా కుమిలిపోతూ, ఏం చేయాలో తోచక అన్ని రకాలుగా నష్టపోయి మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, తెలంగాణ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ సయ్యద్ ముంతాజ్ అలీ రాజ్వి, ఐఏఎస్ శ్రీమతి డాక్టర్ టి కె శ్రీదేవిలకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.