సమగ్ర శిక్ష ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలి

సమగ్ర శిక్ష ఉద్యోగులకు కాంగ్రెస్
ఇచ్చిన హామీని నెరవేర్చాలి

  • లేదంటే రాష్ట్ర సచివాలయ ముట్టడి తప్పదు
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
  • సంఘం ఆధ్వర్యంలో 19 రోజు నిరవధిక సమ్మె

వరంగల్, డిసెంబర్ 24 (విశ్వం న్యూస్) : వరంగల్ జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏక శిల పార్కు కార్యాలయము ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ 19 రోజులుగా నిరవధిక సమ్మె కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ముఖ్య అతిథిగా పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర శిక్ష అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు చేయకుండా మాట మారుస్తున్నారని, వారిని రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులుగా రాష్ట్రవ్యాప్తంగా 19300 మంది, వరంగల్ జిల్లాలో దాదాపుగా 2000 మంది వివిధ విభాగాలుగా పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ వారిని రెగ్యులర్ చేయాలని కోరారు.ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వీరికి న్యాయం చేయాలని లేని యెడల రాష్ట్ర సచివాలయం ముట్టడించడానికి కూడా వెనుకాడమని ఆయన హెచ్చరించారు.

సమ్మె ఉధృతం చేయాదానికి బీసీ సంక్షేమ సంఘం నిరంతరం వెన్నంటి ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ ను కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వారికి వివరించి సమస్య పరిష్కారినికి కృషి చేస్తామని ఆయన తెలిపారు గత పందొమ్మిది రోజులుగా సర్వ శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం చాలా బాధాకరమన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటిట సంక్షేమం అనుకున్నామని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి ఇంటి సంక్షోభం చేస్తుందాన్నారు సమ్మె చేస్తున్న వారంతా బడుగు బలహీన వర్గాల ఉద్యోగులేనని, వారికి అండగా బహుజన సామజం ఉంటుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *