తీన్మార్ మల్లన్నకు భారీ షాక్.. కాంగ్రెస్ పార్టీ సస్పెండ్.. మీనాక్షి నటరాజన్ ఎఫెక్ట్?

హైదరాబాద్, మార్చి 1 (విశ్వం న్యూస్) : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కదలికలు కనిపిస్తున్నాయి. నిన్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రావడం తోనే, యాక్షన్ షురూ అయ్యింది. ఇవాళ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా.. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ.. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. పార్టీ లైన్‌ని ఎవరు ధిక్కరించినా క్రమశిక్షణా చర్యలు ఉంటాయి అని పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు.

సస్పెండ్ ఎందుకు?
తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చెయ్యడం వెనక బలమైన కారణాలు ఉన్నాయి. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు. దాంతోపాటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహించిన కులగణన సర్వేని తీవ్రంగా వ్యతిరేకించారు. లైవ్ టీవీలో కులగణన పత్రాలను చింపివేశారు. అంతేకాకుండా.. మంత్రి కోమటిరెడ్డి సోదరులతో విబేధాలు ఉన్నాయి. దీనికి తోడు ఇతర మంత్రులతో కూడా ఆయన అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీకి పెద్ద సమస్యగా మారింది.

ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో ఇతర నేతలు కోరుతున్నారు. తాజాగా మీనాక్షి నటరాజన్ దృష్టికి ఈ విషయం వచ్చినట్లు తెలిసింది. దాని ఫలితంగా నెక్ట్స్ డే ఆయనపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *