బాధిత కుటుంబ సభ్యులను
పరామర్శించిన ఎమ్మెల్యే

హైదరాబాద్, మార్చి 1 (విశ్వం న్యూస్) : రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పుప్పాలగూడలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రెండంతస్తుల భవనంలో మంటలు వ్యాపించడంతో ముగ్గురు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు, బాలిక ఉన్నారు.
శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు.