రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు మతసామరస్యానికి ప్రతీక కాజీపేట దర్గా

మతసామరస్యానికి ప్రతీక కాజీపేట దర్గా

  • ఐక్యత భావాల పెంపుకు ఇఫ్తార్ విందులు దోహదం
    జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
    కాజీపేట దర్గాలో ఇఫ్తార్ విందు
    పాల్గొన్న ప్రముఖులు
  • కాజీపేట, మార్చి 21 (విశ్వం న్యూస్): కాజీపేట పట్టణంలోని 48వ డివిజన్లో గల అఫ్జల్ బియబాని దర్గాలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొని ముందస్తు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. హన్మకొండ జిల్లా కేంద్రంలో గల కాజీపేట దర్గా మతసామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తుంది అన్నారు. ఐక్యత భావాల పెంపుకు ఇలాంటి ఇఫ్తార్ విందులు దోహదం చేస్తాయని తెలిపారు. అంతకుముందు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మతసామరస్య పరిరక్షణకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కేంద్రంలో గల కాజీపేట దర్గా ప్రపంచ గుర్తింపు పొందిందన్నారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందులో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కార్పొరేటర్లు అబుబకర్, జక్కుల రవీందర్ యాదవ్, కాంగ్రెస్ నేత ఈవీ శ్రీనివాసరావు, వేద పండితులు అయినవోలు రాధాకృష్ణ శర్మ, పలు శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వార్త….శ్యామ్🖋️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *