రైల్వే హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలి

రైల్వే హాస్పిటల్ ను వెంటనే ప్రారంభించాలి

  • దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ను కలిసిన బిజెపి నేతలు

కాజీపేట, మార్చి 21 (విశ్వం న్యూస్): కాజీపేట జంక్షన్ పరిధిలో ఆధునిక హంగులతో నిర్మించిన రైల్వే ఆసుపత్రినీ వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కోరారు. ఈ మేరకు శుక్రవారం కాజీపేట జంక్షన్ కు విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ను వారీతో పాటు పలువురు కాజీపేట పట్టణానికి చెందిన బిజెపి నాయకులు కలిసి వినతి పత్రం సమర్పించారు.

నూతనంగా డాక్టర్లను నియమించడంతోపాటు వైద్య సేవలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. తాము చేసిన విన్నపానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కాజీపేట జంక్షన్ అభివృద్ధికి బిజెపి ఒక ప్రణాళికతో ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎండి చాంద్ పాషా, కాయిత రాజకుమార్, మేకల శ్రావణ్ యాదవ్, ఆకుల శ్రీకాంత్, తోపుచర్ల మధుసూదన్ రావు, శ్రీకాంత్ కళ్యాణ్ జరీనా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త…. శ్యామ్🖋️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *