సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కాంగ్రెస్ నేత దొంతి గోపి

కరీంనగర్, ఎప్రిల్ 7 (విశ్వం న్యూస్) : మారుతి నగర్ 30వ డివిజన్‌కు చెందిన ఎన్. శివ వర్ధన్ మరియు పందిళ్ళ రాజేందర్ గార్లు అనారోగ్య సమస్యల కారణంగా వైద్యం కోసం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో, వారు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేయగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం సహాయాన్ని మంజూరు చేసింది.

రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, 30వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతి గోపి గారు లబ్ధిదారుల నివాసాలకు స్వయంగా వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దొంతి గోపి మాట్లాడుతూ, “గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసినప్పటికీ, రేవంత్ సర్కార్ ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. సీఎం సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి సకాలంలో సహాయం అందుతుంది,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాల్యాల సుజిత్ కూడా పాల్గొన్నారు.