మంచినీటి సమస్యపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు వినతిపత్రం

మంచినీటి సమస్యపై ఎమ్మెల్యే
ప్రకాష్ గౌడ్‌కు వినతిపత్రం

గంధంగూడ, నార్సింగి, ఎప్రిల్ 7 (విశ్వం న్యూస్) : గంధంగూడ మరియు పరిసర కాలనీల్లో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో స్థానికులు ఈ రోజు ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రజల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. వెంటనే వాటర్ బోర్డ్ మేనేజర్‌తో టెలిఫోన్ ద్వారా మాట్లాడి, తగిన చర్యలు తీసుకొని త్వరలో సమస్యను పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలపల్లి కృష్ణారెడ్డి, నార్సింగి మార్కెటింగ్ డైరెక్టర్ తలారి ప్రేమ్ కుమార్, బోగాల శ్రీనివాస్, కృష్ణసాగర్, అంకం శ్రీనివాస్, మదర్ వెంకటేశ్వర నగర్ కాలనీ, గంధంగూడ ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.

స్థానికులు త్వరితగతిన మంచినీటి సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *