జర్నలిస్టులపై దాడులకు నిరసన

జర్నలిస్టులపై దాడులకు నిరసన

పీర్జాదీగూడ, జనవరి 30 (విశ్వం న్యూస్) : మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలో ఆదివారం నాడు రాత్రి పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఅర్ఎస్ పార్టీ డిప్యూటీ మేయర్ మరికొందరు ప్రజాప్రతినిధుల భర్తలు పేకాట అడుతున్నారు అని సమాచారం మేరకు వార్త కవరేజి కోసం వెళ్ళిన మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడిన బీఅర్ఎస్ పార్టీ. ప్రజాప్రతినిధుల దాడులకు నిరసనగా ఈరోజు మేడిపల్లి పీఎస్ ముందు ధర్నా నిర్వహించి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తూ మేడిపల్లి సీఐ గోవర్ధన గిరి కి వినతిపత్రం అందచేయాడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంకూరి మురళి, ప్రధాన కార్యదర్శి కల్కూరి ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, బీజేపీ అధ్యక్షుడు ఎన్.అనీల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి, ఎంఅర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పంగ ప్రణయ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎండీ అన్వర్, ప్రెస్ క్లబ్ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *