బలగం’ నటుడు కన్నుమూత- దర్శకుడు వేణు ఎమోషనల్​

బలగం’ నటుడు కన్నుమూత
దర్శకుడు వేణు ఎమోషనల్

హైదరాబాద్, మే 25 (విశ్వం న్యూస్): ‘బలగం’ సినిమాలో అంజన్న పాత్రలో నటించిన ప్రముఖ రంగస్థల కళాకారుడు జీవీ బాబు (గుడిబోయిన బాబు) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, ‘బలగం’ దర్శకుడు యెల్దండి వేణు, నటుడు ప్రియదర్శి వంటి పలువురు కళాకారులు ఆర్థిక సాయం అందించారు. జీవీ బాబు జీవితాన్ని నాటక రంగానికి అంకితం చేశారు. ఆయన మరణంపై దర్శకుడు వేణు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జీవీ బాబు మరణం తెలుగు నాటక, సినిమా రంగాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *