కరీంనగర్ లో ఘనంగా ప్రారంభమైన తానాకాన్ కాన్ఫ రెన్స్

కరీంనగర్ లో ఘనంగా ప్రారంభమైన తానాకాన్ కాన్ఫరెన్స్

కరీంనగర్, మే 24 (విశ్వం న్యూస్): కరీంనగర్ లోని ప్రతిమ మల్టీప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో తానాకాన్-2025 కాన్ఫరెన్స్ తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.

శనివారం మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్పెషాలిటీ డాక్టర్స్ తమ యొక్క లేటెస్ట్ అప్డేట్ డెలిగేట్స్కి చూపించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డా. విజయ్ కుమార్ నాయర్ కారికల్ మెడికల్ కాలేజ్ పాండిచ్చేరి నుండి వచ్చి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ గూర్చి క్లుప్తంగా తెలియపరిచినారు, అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ గూర్చి చర్చించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి సుమా రు 900 డాక్టర్స్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డా. ఎలగందుల శ్రీనివాస్ ఆర్గనైజేషన్ చైర్మన్, డా. అరుణ్ కటారి ప్రెసిడెంట్ ఎలెక్ట్ తానా తెలంగాణ స్టేట్, డా. చాట్ల శ్రీధర్, డా. రాజకుమార్, డా. మంగీ లాల్, డా. సునీల్ రెడ్డి, డా. మహేష్, డా. సూర్యనారా యణ రెడ్డి, డా.జగన్ మోహన్ రావు, డా. బి.ఎన్. రావు, డా. విజేందర్ రెడ్డి, డా. టీకేకే నాయు డు, డా. లక్ష్మణ్, డా.రఘురాం, డా. విజయ మోహన్ రెడ్డి, డా. శ్రీలత రెడ్డి, డా. శైలజ, డా. మమతారెడ్డి, డా.వై నరేంద్ర,డా. జయరాం, డా.ఈ శైలజ, డా. శేష శైలజ, డా. రవికాంత్, డా. రమణాచారి, డా. రామ్ కిరణ్ లతో పాటు ఇతర ప్రముఖ డాక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.
-నేడు (ఆదివారం) ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం లో హెల్త్ మినిస్టర్ దామోదర రాజా నరసింహ, ఐటి మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు , ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యేలు డా. కవంపల్లి సత్యనారాయణ, గంగుల కమలాకర్, డా. సంజయ్ కుమార్, మేడిపల్లి సత్యం, ఇతర ప్రముఖులు పాల్గొ నున్నట్లు తానాకాన్ నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *